చైనాకు భారత్ గట్టి షాకిచ్చింది. చైనా వర్సిటీల్లో చదువుతున్న భారత స్టూడెంట్ల భవితవ్వాన్ని ప్రశ్నార్థకం చేస్తున్న.. పర్యాటక వీసాలను సప్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ వాయు రవాణా సంస్థ ఈ మేరకు వెల్లడిరచింది. చైనీయులకు జారీ చేసిన పదేళ్ల కాల పరిమితితో కూడిన పర్యాటక వీసాలు కూడా చెల్లబోవని పేర్కొంది. చైనా వర్సిటీల్లో 22 వేల దాకా భారత స్టూడెంట్లు చదువుతున్నారు. కరోనా నేపథ్యంలో 2020లో తిరిగొచ్చిన వాళ్లను నేటికి చైనా తిరిగి తమ దేశంలో అడుగు పెట్టనివ్వడం లేదు. వారి భవిష్యత్తు దృష్ట్యా సానుభూతితో ఆలోచించాలని చైనాకు భారత్ పలుమార్లు విజ్ఞప్తి చేసింది. విదేశాంగ మంత్రి వాంగ్ యీతో దీన్ని ప్రస్తావించారు. అయినా లాభం లేకపోవడంతో భారత్ తాజాగా వీసాల సస్పెన్ష్‌న్ నిర్ణయం తీసుకుంది.














