న్యాయ వ్యవస్థపై జనంలోని అభిప్రాయాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ చమత్కారంగా తెలిపారు. చెన్నైలో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరిత గతిన న్యాయం దక్కాలని జనం కోరుకుంటున్నారని తెలిపారు. ఇన్ట్సంట్ సూడిల్స్ మాదిరిగా జనం ఇన్‌స్టంట్ జస్టిన్ను కోరుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఫలితంగా నిజమైన బాధితులకు న్యాయం దక్కడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేసు ఏదైనా లోతుగా దర్యాప్తు చేయాల్సిందేనని ఆయన అన్నారు. కింది స్థాయి కోర్టుల్లో స్థానిక భాష వాడితే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.














