మహేష్‌బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న చిత్రం సర్కారు వారి పాట. ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను మే 2న విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు తెలిపారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. మే 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మే 7న హైదరాబాద్‌లో ప్రి రిలీజ్ వేడుక నిర్వహిస్తారని తెలిపింది. చట్టంలోని లొసుగుల్ని అడ్డుపెట్టుకొని బడా బాబులు చేసే బ్యాంకు మోసాలు, రైతులు పడే ఇబ్బందుల్ని చర్చిస్తూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. వెన్నెల కిషోర్, సుబ్బరాజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఆర్.మది, సంగీతం: తమన్, నిర్మాణ సంస్థలు : మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ ప్లస్, సీఈవో: చెర్రీ, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.రవిశంర్, రామ్ ఆచంట, రచన, దర్శకత్వం: పరుశురాం పెట్ల.














