బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇటీవల భారత్లో పర్యటించారు. ఈ సందర్భంగా గుజరాత్లోని బుల్డోజర్ తయారీ కంపెనీని జాన్సన్ సందర్శించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశాన్ని ఆ దేశ పార్లమెంటులో ప్రతిపక్ష సభ్యులు లేనెత్తారు. భారత్లో పర్యటించిన బోరిస్ ఓ ప్రైవేటు కంపెనీని సందర్శించడమేంటని నిలదీశారు. కొద్దికాలం నుంచి భారత్లో బుల్జోడర్ సంస్కృతి కొనసాగడాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రశ్నించారు. దీంతో స్పందించిన అధికార పక్షం భారత్తో తాము సత్సంబంధాలు కోరుకుంటున్మానని, ఈ సంబంధాలు ఇరు దేశాలకు ప్రయోజనం చేకూర్చుతాయని తెలిపింది.














