Namaste NRI

ట్రైలర్‌ కంటే సినిమా వందరెట్లు అద్భుతంగా… పరశురామ్‌

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ప్రతిష్టాత్మక చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమా ఇప్పటికే అదిరిపోయే ప్రమోషనల్‌ కంటెంట్‌లో దూసుకుపోతోంది. ఇపుడా అంచనాలను మరోస్థాయి తీసుకెళ్లింది ఈ చిత్రం ట్రైలర్‌. భ్రమరాంభ థియేటర్‌లో ఫ్యాన్స్‌ కోలాహలం మధ్య సర్కారు వారి పాట థియేట్రికల్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా పరశురామ్‌ మాట్లాడుతూ  ట్రైలర్‌కు ఫ్యాన్స్‌  నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే హ్యాపీగా ఉందన్నారు. ట్రైలర్‌ కంటే సినిమా వందరెట్లు అద్భుతంగా ఉంటుందని ప్రామిస్‌ చేస్తున్నానని అన్నారు. ప్రస్తుతానికి ట్రైలర్‌ను ఎంజాయ్‌ చేయండి అన్నారు. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో కలుద్దామని తెలిపారు. నిర్మాత నవీన్‌ యెర్నేని మాట్లాడుతూ మా డైరెక్టర్‌ పరుశురామ్‌ చెప్పినట్టు ట్రైలర్‌ కంటే సినిమా వంద రెట్లు బాగుంటుందన్నారు. ఇది గ్యారంటీ అన్నారు.  ట్రైలర్‌ విషయాని కొస్తే మహేష్‌బాబు అభిమానులకు పండగ లాంటి సినిమా సర్కారు వారి పాట అని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతుందన్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌, జిఎంబీ ఎంటర్‌ టైన్‌మెంట్స్‌, 14 రీల్స్‌ ప్లన్‌ బ్యానర్లపై నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌, రామ్‌ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శక నిర్మాతలు పరుశురామ్‌, నవీన్‌ యేర్నేని, వై రవిశంకర్‌, రామ్‌ ఆచంట, గోపీ ఆచంట పాల్గొన్నారు. ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events