నాగశౌర్య తాజా చిత్రం కృష్ణ వ్రింద విహారి. ఇప్పటికే ఫస్ట్ సింగిల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుండి మరో పాటను విడుదల చేశారు. ఏముంది రా లిరికల్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. హరిచరణ్ ఆలపించిన ఈ పాటని మహతి స్వరసాగర్ కంపోజ్ చేశారు. హర్ష సాహిత్యం అందించారు. లిరికల్ వీడియో ఆకట్టుకునే విధంగా ఉంది. నాగశౌర్యతో పాటు షిర్లీ సెటియా నటించారు. షిర్లిని అగ్రహారానికి తీసుకురావడం, ఆమె సంప్రదాయ బ్రాహ్మణ యువతిలా కనిపించడం, హల్తీ వేడుక మొదలుకొను పెళ్లి, సీమంతం, పిల్లలు ఇలా అన్ని సందర్భాలను పాటలో చూపించారు. సీనియర్ నటి రాధిక ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా ముల్పూరి నిర్మిస్తున్నారు. శంకర్ ప్రసాద్ మూల్పూరి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ కథతో దర్శకుడు అనీష్ ఆర్ కృష్ణ రూపొందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతున్నది.














