Skip to main content

Namaste NRI

రష్యాకు భారత్‌ ఆఫర్‌… తక్కువ ధరకే

ముడి చమురును మార్కెట్‌ ధర కంటే చాలా తక్కువకే కొనుగోలు చేసే విషయమై రష్యాతో భారత్‌ చర్చలు నిర్వహిస్తోంది. 70 డాలర్లకు  లోపే బ్యారెల్‌ ముడి చమురును భారత్‌కు డెలివరీ చేయాలని డిమాండ్‌ చేస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం కలిగిన వర్గాలు వెల్లడిరచాయి. ఇందుకు సంబంధించి ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి చర్చలు నడుస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఒక బ్యారెల్‌ ధర అంతర్జాతీయ మార్కెట్లో 105 డాలర్ల  వద్ద ఉంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలు పెట్టిన తర్వాత నుంచి రెండు నెలల్లోనే భారత్‌ 40 మిలియన్‌ బ్యారెళ్లు చమురును రష్యా నుంచి దిగుమతి చేసుకుంది. 2021లో రష్యా నుంచి భారత్‌ చేసుకున్న మొత్తం చమురు దిగుమతుల కంటే 20 శాతం ఎక్కువ. మన దేశ అవసరాల్లో 85 శాతం మేర  దిగుమతుల రూపంలోనే తీర్చుకుంటున్న విషయం తెలిసిందే.  మార్కెట్‌ ధర కంటే తక్కువకే విక్రయిస్తామంటూ రష్యా లోగడ భారత్‌కు ఆఫర్‌ ఇచ్చింది. రష్యా నుంచి చమురు కొనుగోలుకు దూరండా ఉండాలని అమెరికా సైతం భారత్‌కు సూచించింది. దీంతో దేశ ప్రయోజనాలకే తమ మొదటి ప్రాధాన్యం అని విదేశాంగ మంత్రి జైశంకర్‌ స్పష్టం చేశారు.

Social Share Spread Message

Latest News