Namaste NRI

మేజర్‌ ట్రైలర్‌ ఆరోజే

హీరో అడివి శేష్‌ నటిస్తున్న సినిమా మేజర్‌. 26/11 ముంబై ఉగ్రదాడుల్లో అమరుడైన మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్నది. శోభితా ధూళిపాల, సయి మంజ్రేకర్‌ నాయికలుగా నటిస్తున్నారు. శేష కథ స్క్రీన్‌ప్లే అందించిన  ఈ చిత్ర ట్రైలర్‌ను ఈ నెల 9న విడుదల చేస్తున్నట్లు దర్శక నిర్మాతలు ప్రకటించారు. ముంబై ఉగ్రదాడి అమరుడు మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ చేసిన సాహసాలను సినిమాలో చూపిస్తున్నారు. ఈ చిత్రానికి శశికిరణ్‌ తిక్క దర్శకత్వం వహించారు. ఈ పాన్‌ ఇండియా మూవీని తెలుగు, హిందీలో చిత్రీకరణ జరిపారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్నది. ఈ సినిమా ప్రకాష్‌ రాజ్‌, రేవతి, మురళి శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జూన్‌ 3న సినిమాను విడుదల చేయబోతున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events