Namaste NRI

చైనా వికృత చర్యలు.. బలవంతంగా

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పట్టినప్పటికీ చైనా నగరాల్లో మాత్రం దాని ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కొవిడ్‌ జీరో విధానాన్ని అమలు చేస్తోన్న చైనా, పలు నగరాల్లో కఠిన లాక్‌డౌన్‌ ఆంక్షలను అమలు చేస్తోంది. ఈ క్రమలో దారుణమైన దాడులు, అధికార దుర్వినియోగం వంటి క్రూరమైన చర్యలకు చైనా ప్రభుత్వం పాల్పడుతుందనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.  ముఖ్యంగా చైనాలో కరోనా తీవ్ర రూపం దాలుస్తోంది.  దీంతో ప్రజలు కరోనా కంటే లాక్‌డౌన్‌కే ఎక్కువ భయపడిపోతున్నారు.  షాంఘై తదితర ప్రాంతాల్లో కరోనా లక్షణాలు  లేకున్నా, ఐసోలేషన్‌లోకి పంపిస్తున్నారు. లాగే షాంఘైను విడిచి విదేశీయులు వెళ్లిపోతున్నారు. అయితే చైనాలో బలవంతంగా కరోనా పరీక్షలు చేయడం కలకం రేపుతోంది. బలవంతపు కరోనా పరీక్షలు చేస్తున్న వీడియోలో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. మహిళలను బలవంతంగా టెస్టింగ్‌ సెంటర్‌లో కూర్చోబెట్టి, కరోనా పరీక్షలు చేస్తున్న వీడియో తెగ వైరల్‌ అవుతోంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events