భారతీయ ప్రేక్షక లోకం ఎదురుచూస్తున్న మోస్ట్ అవెయిటెడ్ చిత్రాల్లో ఒకటి మేజర్. మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం మేజర్. అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించగా, శశికిరణ్ తిక్కా దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా కథానాయకుడు, దర్శకుడు దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాత్ సింగ్‌తో ఢల్లీిలో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. సినిమా ట్రైలర్‌ని చూపిచండంతో పాటు, కథ గురించి వివరించారు. ఈ సందర్భంగా జూన్ దూంగా దేశ్‌నహీ అనే సినిమా నినాదాన్ని రాజ్‌నాథ్ సింగ్ ఆవిష్కరించారు. అనంతరం దేశం కోసం ప్రాణాలర్పించిన వీరుడి కథని చూపించనున్న దర్శకుడు, కథానాయకుడిని రక్షణ మంత్రి అభినందించినట్టు తెలిపింది చిత్రబృందం. త్వరలోనే రాజ్‌నాథ్ సింగ్ కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేకంగా సినిమాని ప్రదర్శించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పాన్ ఇండియా చిత్రగా పలు భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాలో శోభితా ధూళిపాల, సయీ మంజ్రేకర్, ప్రకాష్‌రాజ్, రేవతి, మురళిశర్మ తదితరులు నటించారు. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంస్థ నిర్మిస్తోంది. స్టార్ హీరో మహేష్ బాబు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు. తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో జూన్ 3న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.














