శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే శ్రీలంకలో మళ్లీ ఎమర్జెన్సీ విధిస్తున్నట్టు ప్రకటించారు. శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిపోయాయి. శాంతి భద్రతలను కాపాడేందుకు, ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు వీలుగా ఎమర్జెన్సీ విధిస్తున్నట్టు అధ్యక్షుడు ప్రకటించారు. ఎమర్జెన్సీ సమయంలో పోలీసులు, భద్రతా బలగాలకు అపరిమిత అధికారాలు లభిస్తాయి. నిరసనకారులను ఎవరినైనా ఎలాంటి కారణాలు చూపకుండానే అరెస్టు చేయొచ్చు.














