రష్యా నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసే అంశంలో ఈయూ దేశాలు కొత్త నిర్ణయాన్ని తీసుకున్నాయి. బ్రస్సెల్స్‌లో జరిగిన ఈయూ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నాయి. రష్యా నుంచి దిగుమతి అవుతున్న ఇంధనంలో రెండిరట మూడవ వంతును ఆపేయాలని ఆ దేశాలు భావించాయి. సముద్ర మార్గంలో వచ్చే ఇంధన దిగుమతిపై బ్యాన్ విధిస్తున్నట్లు ఈయూ చెప్పింది. కానీ పైప్‌లైన్ ద్వారా సరఫరా అవుతున్న ఇంధన దిగుమతి కొనసాగించనున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయం వల్ల హంగేరికి ఊరట కలిగింది. ఈ ఆంక్షల వల్ల రష్యా ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం పడే అవకాశాలు ఉన్నట్లు యురోపియన్ కౌన్సిల్ చీఫ్ చార్లెస్ మైఖేల్ తెలిపారు. ఆరవ ఆంక్షల ఫ్యాకేజీపై 27 సభ్య దేశాలు అంగీకరించినట్లు ఆయన వెల్లడిరచారు.














