పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌కు దీర్ఘశ్రేణి క్షిపణులను సరఫరా చేయడం కొనసాగితే దాడులను మరింత పెంచుతామని, ఇప్పటి వరకు లక్ష్యంగా చేసుకోని ప్రాంతాలపై దాడులు చేస్తామని కీవ్‌లో తాజా దాడులకు కొన్ని గంటల తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించారు. తీరు మార్చుకోవాలని, తమ మాట వినకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, ఇప్పటిదాకా ఎన్నడూ దాడి చేయని లక్ష్యాలపై దాడులకు దిగుతామని తేల్చి చెప్పారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధాన్ని సాధ్యమైనంత ఎక్కువ కాలం పొడిగించేందుకు పశ్చిమ దేశాలు కుట్ర పన్నుతున్నాయని, అందులో భాగంగానే ఉక్రెయిన్‌కు ఆయుధాలు ఇస్తున్నాయని మండిపడ్డారు. ఎవరు ఎన్ని ఆయుధాలు అందజేసిన ఉక్రెయిన్ ప్రభుత్వం ఇంకా నష్టపోవడం తప్ప సాధించేదేమీ ఉండదని తేల్చిచెప్పారు. ప్రత్యర్థిని ఎలా దెబ్బకొట్టాలో తెలుసని, తమవద్ద కూడా ఆయుధాలు ఉన్నాయన్న సంగతి మర్చిపోవద్దని హెచ్చరించారు. ఉక్రెయిన్‌కు 70 కోట్ల డాలర్ల భద్రతాపరమైన సాయం చేస్తామని అమెరికా ప్రకటించిన నేపథ్యంలో పుతిన్ ఈ తరహా హెచ్చరికలు చేయడం గమనార్హం.














