టీఆర్ఎస్ మలేషియా అధ్యక్షుడు చిట్టి బాబు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని పేద విద్యార్థులకు స్కూలు బ్యాగులు పంపిణీ చేశారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ వారి నియోజక వర్గాల్లో పిల్లలందరికీ బ్యాగులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మలేషియా అధ్యక్షుడు చిట్టి బాబు చిరుత, కార్యదర్శి గుండా వెంకటేశ్వర్లు, కోర్ కమిటీ సభ్యులు సత్యనారాయణరావ్ నడిపెల్లి, సందీప్‌కుమార్ లగిశెట్టి, జీవన్‌కుమార్, మునిగాల అరుణ్ తదితరులు పాల్గొన్నారు.














