Skip to main content

Namaste NRI

విక్టరీ వెంకటేష్‌ చేతులమీదుగా దర్జాగా ట్రైలర్‌ విడుదల

సునీల్‌, అనసూయ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం దర్జా. కామినేని శ్రీనివాస్‌ సమర్పణలో సలీమ్‌ మాలిక్‌ దర్శకత్వంలో శివశంకర్‌ పైడిపాటి నిర్మించారు. ఆమని, పృథ్వి, ఆక్సాఖాన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ నేపథ్యంలో హీరో వెంకటేష్‌ ట్రైలర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రైలర్‌ చాలా బాగుంది. రిచ్‌గా తెరకెక్కించారు. పెద్ద సక్సెస్‌ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్నారు. సహా నిర్మాత రవి పైడిపాటి మాట్లాడుతూ ఇదొక వినూత్నమైన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. ఈ నెలాఖరున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌, నిర్మాత పైడిపాటి శివశంకర్‌, కో అండ్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ రవి పైడిపాటితో పాటు చిత్ర దర్శకుడు సలీం మాలిక్‌, సంగీత దర్శకులు రాపక్ర్‌ షకీల్‌, కెమెరామెన్‌ దర్శన్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. సంగీతం: రాప్‌ రాక్‌ షకీల్‌, ఛాయాగ్రహణం :దర్శన్‌.

Social Share Spread Message

Latest News