అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం థ్యాంక్ యూ. విక్రమ్. కె.కుమార్ దర్శకుడు. రాశి ఖన్నా, మాళవిక నాయక్, అవికా గోర్ కథానాయికలు. టీజర్‌తో అందరిలోనూ ఆసక్తిని కలిగించిన ఈ చిత్రం నుంచి చైతన్య, మాళవికలపై చిత్రీకరించిన ప్రేమగీతమిది. ఏంటో ఏంటేంటో.. నాలో ఏంటేంటో.. నాతో నువ్వేంటో.. నీత నేనేంటో.. చూసే చూపేంటో.. మారే తీరెంటో అంటూ సాగే మెలోడి లిరికల్ వీడియోను విడుదల చేశారు. ఈ పాటకు తమన్ స్వరాలు సమకూర్చగా అనంత్ శ్రీరామ్ సాహిత్యాన్ని అందించారు. జోనిత గాంధీ ఆలపించారు. వినూత్నమైన ప్రేమకథతో తెరకెక్కిన చిత్రమిది. ఇందులో నాగచైతన్య మూడు భిన్నమైన లుక్స్‌లో కనిపించనున్నారు. దిల్‌రాజు, శిరిష్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా జులై 8న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి కథ: బీవీఎస్ రవి, ఛాయాగ్రహణం: పీసీ శ్రీరామ్.














