Namaste NRI

పృధ్వీరాజ్‌ కడువా టీజర్‌ రిలీజ్‌

పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కథానాయకుడిగా నటించిన మలయాళీ చిత్రం కడువా. మ్యాజిక్‌ ఫ్రేమ్స్‌, పృథ్వీరాజ్‌ ప్రొడక్షన్స్‌ పతాకాలపై లిస్టిన్‌ స్టీఫెన్‌, సుప్రియా మీనన్‌ నిర్మించారు. ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా టీజర్‌ను విడుదల చేశారు. పృథ్వీరాజ్‌ మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకులు సినిమాను గొప్పగా ప్రేమిస్తారు. భవిష్యత్తులో నా సినిమాలన్నింటినీ తెలుగులో విడుదల చేయడానికి ప్రయత్నిస్తా అన్నారు. కడువా నా కెరీర్‌లో ప్రత్యేకమైన సినిమా. తెలుగు ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది. డబ్బింగ్‌ వెర్షన్‌ను అద్భుతంగా తీర్చిదిద్దాం. త్వరలోనే తెలుగు, మలయాళం పరిశ్రమల కాంబినేషన్‌లో పెద్ద ప్రాజెక్ట్స్‌ వస్తాయనే నమ్మకం ఉందన్నారు. వివేక్‌ ఒబెరాయ్‌ మాట్లాడుతూ ఈ సినిమా ఇద్దరు బలమైన వ్యక్తుల మధ్య పోటీలా ఉంటుంది. ఈ కథను ఫోన్‌లో విని ఒకే చేశారు. సినిమా ఖచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందన్నారు. సంయుక్త మీనన్‌ మాట్లాడుతూ తెలుగువారికి సినిమా అంటే ఓ పాషన్‌.  కడువా సినిమా థియేటర్స్‌లో కూడా అవే సెలబ్రేషన్స్‌ ఉండాలని కోరుకుంటున్నా అని పేర్కొంది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌ సభ్యులందరూ పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events