రష్యాపై పశ్చిమ దేశాల ఆర్థిక ఆంక్షలు మరింత కఠినతరం కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు రకాలుగా రష్యా ఆర్థిక వ్యవస్థను బలహీనం చేసి, ఉక్రెయిన్‌పై జరుగుతున్న దాడిని నిలువరించేందుకు పశ్చిమ దేశాలు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. రష్యా నుంచి బంగారం దిగుమతులపై పూర్తిగా నిషేధం విధించాలని జీ`7 దేశాలు భావిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ఈ చర్య వల్ల ఆర్థికంగా ప్రపంచంలో రష్యా ఏకాకి అవుతుందన్నారు. చమురు తర్వాత రష్యా నుంచి అత్యధికంగా ఎగుమతి అయ్యేది బంగారమే. 2020లో ప్రపంచం మొత్తం బంగారు ఎగుమతుల్లో రష్యా వాటా 5 శాతం దీని విలువ 19 బిలియన్ డాలర్లు. దీనిలో 90 శాతం బంగారం జీ7 దేశాలకే వెళ్లోంది. ఉక్రెయిన్‌పై జరుగుతున్న యుద్ధానికి అవసరమైన నిధులు సమకూర్చుకోకుండా రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై అమెరికా చరిత్రలో లేని విధంగా ఆంక్షలు విధించింది.














