Skip to main content

Namaste NRI

ఈ బిల్లుకు రిపబ్లికను కూడా మద్దతివ్వడం చరిత్రాత్మకం

తుపాకుల వాడకం బిల్లుకు రిపబ్లికన్లు కూడా మద్దతివ్వడం చరిత్రాత్మకం అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అన్నారు. తుపాకుల వాడకంపై నియంత్రణకోసం అమెరికా ప్రభుత్వం చట్టం చేసింది. బిల్లుపై అధ్యక్షుడు జో బైడెన్‌ సంతకం చేశారు. ఈ చట్టం ఎంతో మంది ప్రాణాలను కాపాడుతుంది అన్నారు. అయితే తాను కోరుకొంటున్న అన్ని అంశాలు ఈ చట్టంలో లేవని పేర్కొన్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ చట్టం సరిపోతుందన్నారు. యువకులు, నేరపూరిత స్వభావం ఉన్నవారికి తుపాకులు తేలిగ్గా లభించకుండా ఈ చట్టం నియంత్రిస్తుంది. ప్రమాదకరమైన వ్యక్తులుగా భావిస్తున్నవారి నుంచి తుపాకులు స్వాధీనం చేసుకోవడానికి అధికారం కల్పిస్తుంది. తుపాకుల అక్రమ రవాణాను నిరోధిస్తుంది. ఈ బిల్లు ప్రతినిధుల సభలో 234`193 ఓట్ల తేడాతో పాసైంది. ఈ బిల్లు సెనేట్‌లో కూడా ఆమోద ముద్ర పడిరది.

Social Share Spread Message

Latest News