Namaste NRI

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ విదేశీ పర్యటన… షెడ్యూల్‌ ఇదే

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ విదేశీ టూర్‌కు వెళ్లనున్నారు. దానికి సబంధించిన షెడ్యూల్‌ ఖరారైంది. తజకిస్తాన్‌, తుర్కమెనిస్తాన్‌ దేశాలకు పుతిన్‌ వెళ్లనున్నట్లు సమాచారం. తజక్‌ రాజధాని డుషాన్బేల్‌లో అధ్యక్షుడు ఎమ్మోమాలి రెహ్మాన్‌ను పుతిన్‌ కలవనున్నట్లు అధికారులు తెలిపారు. ఆష్ఘాబాట్‌లో జరగనున్న కాస్పియన్‌ దేశాల నేతల సదస్సుకు కూడా హాజరవుతారు. దీంట్లో అజర్‌బైజాన్‌, కజకిస్థాన్‌, ఇరాన్‌, తుర్కమెనిస్థాన్‌ దేశాలు ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై ఆక్రమణకు దిగిన తర్వాత పుతిన్‌ దేశం విడిచి ఎటూ వెళ్లలేదు. అయితే ఇదే తొలి విదేశీ పర్యటన కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events