Namaste NRI

చైనా శుభవార్త… విదేశాల నుంచి వచ్చేవారిపై

చైనా శుభవార్త చెప్పింది. ఇక విదేశాల నుంచి వచ్చేవారిపై ఉన్న క్వారెంటైన్‌ ఆంక్షలను చైనా సడలించింది. మిగితా దేశాలతో పొలిస్తే చైనా కఠినమైన కోవిడ్‌ విధానాన్ని అవలంభిస్తోంది. విదేశాల నుంచి చైనాకు వచ్చే వాళ్లు హోటల్లో ఏడు రోజుల పాటు క్వారెంటైన్‌లో ఉండాలని, ఆ తర్వాత మూడు రోజుల పాటు హోమ్‌ అబ్జర్వేషన్‌లో ఉండాలని జాతీయ ఆరోగ్య శాఖ తెలిపింది. గతంలో హోటల్‌ క్వారెంటైన్‌ 14 రోజులు, హోమ్‌ అబ్జర్వేషన్‌ ఏడు రోజుల పాటు ఉండేది. జీరో కోవిడ్‌ విధానంలో భాగంగా చైనాలో కఠిన ఆంక్షలను అమలు చేశారు. వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు లాక్‌డౌన్‌ అమలు చేశారు. మాస్‌ టెస్టింగ్‌ కూడా నిర్వహించారు. బీజింగ్‌తో పాటు మరో ఏడు నగరాల్లో కోవిడ్‌ ఆంక్షలను సడలించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events