Namaste NRI

ఫిమేల్‌ టైటిల్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేసిన మంత్రి సబితా

శుభాంగి తంబాలే ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ఫీమేల్‌. బేబీ దీవెన, దీపిక, తమన్నా సింహాద్రి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వీపీఆర్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై వెలిచర్ల ప్రదీప్‌ రెడ్డి నిర్మించారు. తాజాగా ఈ సినిమా పోస్టర్‌ను తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ చిత్రం ద్వారా మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంచే ప్రయత్నం చేస్తున్నారు. సమాజంలో మార్పు తీసుకొచ్చే దిశగా ఈ సినిమా ఉపయోగపడాలని కోరుకుంటున్నా అన్నారు. మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాల నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కించారు దర్శకుడు నాని తిక్కిశెట్టి. సంగీతం: వంశీకాంత్‌ రేఖన, కూర్పు: క్రాంతి, ఛాయాగ్రహణం: జగదీష్‌ కొమరి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events