అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భార్య, కుమార్తె సహా 25 మంది అమెరికన్లపై రష్యా నిషేధం విధించింది. వారు రష్యాలో ప్రవేశించడంపై ఈ నిషేధం వర్తిస్తుందని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రష్యాకు చెందిన రాజకీయ, పౌర ప్రముఖులపై ఆంక్షలు మరింత విస్తృతం చేస్తున్నందుకు బదులుగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు రష్యా తెలిపింది. 25 మంది అమెరికన్లను తాము నిషేద్ధ వ్యక్తుల జాబితాలో చేర్చామని రష్యా వివరించింది. ఆయా వ్యక్తుల పేర్లతో కూడిన జాబితాను తన ప్రకటనకు రష్యా జోడిరచింది. వారిలో సుసాన్ కొలిన్స్, మిచ్ మెకాకానెల్, చార్లెస్ గ్రాస్లే, కిర్‌స్టెన్ గిల్లి బ్రాండ్ వంటి సెనేటర్లు కూడా ఉన్నారు. వారితో పాటు పలువురు వర్సిటీ ప్రొఫెసర్లు, పరిశోధకులు, అమెరికా ప్రభుత్వ మాజీ అధికారులు పేర్లు కూడా జాబితాలో పొందుపరిచారు.














