Namaste NRI

శాన్‌ ఫ్రాన్సిస్కోలో జస్టిస్‌ ఎన్వీ రమణకు ఘన స్వాగతం

అమెరికాలో పర్యటిస్తున్న భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణకు శాన్‌ ఫ్రాన్సిస్కోలో ఘన స్వాగతం లభించింది. అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండో అమెరికన్స్‌ (ఏఐఏ) అధ్యక్షుడు జయరాం కోమటి తన కార్యవర్గంతో కలిసి విమానాశ్రయంలో సీజేఐ దంపతులకు స్వాగతం పలికారు. స్థానిక భారత కాన్సులేట్‌ సిబ్బంది కూడా ఏయిర్‌పోర్ట్‌కు చేరుకుని భారత ప్రభుత్వం తరపున ఆయన ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో భారత్‌ బయోటెక్‌ అధినేత్రి సుచిత యెల్ల, అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండో అమెరికన్స్‌ కార్యవర్గ సభ్యులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events