Skip to main content

Namaste NRI

హ్యాపీ బర్త్‌డే  పార్టీ సాంగ్‌ వచ్చేసింది

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం హ్యాపీ బర్త్‌ డే. నరేష్‌ అగస్త్య, సత్య, వెన్నెల కిషోర్‌, గెటప్‌ శ్రీను తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి రితేష్‌ రానా దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మిస్తోంది. ఇటీవలే చిత్ర ట్రైలర్‌ను దర్శకుడు రాజమౌళి చేతుల మీదుగా రిలీజ్‌ చేశారు.  తాజాగా ఈ సినిమా నుంచి ఓన్లీ లీగల్‌ పార్టీ సాంగ్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అంటూ జోష్‌ ఫుల్‌ పాటను విడుదల చేశారు. ఈ పార్టీ సాంగ్‌కు కాలభైరవ క్యాచీ ట్యూన్‌ అందించారు. ఆ పాటకు లావణ్య త్రిపాఠి డాన్స్‌ ప్రత్యేక ఆకర్షణ కానుంది. కిట్లూ విస్సాప్రగడ సాహిత్యాన్ని అందించారు. ఓన్లీ లీగల్‌ పార్టీ సాంగ్‌ ఆఫ్‌ ద ఇయార్‌ అంటూ ఈ పాటను విడుదల చేశారు చిత్రం బృందం. నవీన్‌ యెర్నేని, వై రవిశంకర్‌ సమర్పణలో చిరంజీవి (చెరీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల 8న విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News