Skip to main content

Namaste NRI

రాజకీయ అతిరధుల మధ్య నూతన చిత్రం ప్రారంభం

విఘ్నేష్‌రెడ్డి, శ్రీ హర్షిత జంటగా ఓ కొత్త సినిమా ప్రారంభమైంది. ఈ చిత్రానికి ఆర్జీ గండికోట దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర షూటింగ్‌ ప్రారంభోత్సవం నల్గొండ జిల్లా,  చిన్నమాదారం గ్రామంలో జరిగింది. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌ రెడ్డి, నాగార్జున సాగర్‌ ఎమ్మెల్యే నోముల భగత్‌తో పాటు మున్సిపల్‌ చైర్మన్‌ మందాడి సైదిరెడ్డి అతిథులుగా హాజరయ్యారు. ఈతరం ప్రేక్షకులను ఆలోచింపజేసే చిత్రమిదని, శరవేగంగా చిత్రీకరణ జరిపి నవంబర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఈ సందర్భంగా నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రకథ ఎంపిక ప్రత్యేకమైందని, నేటి ప్రేక్షకులకు అనుగుణంగా ఉంటూ పాజిటివ్‌ ఆలోచనలను ప్రేరేపించే అంశాలు ఉంటాయని తెలిపారు. గవి సినిమాస్‌, సిల్లీ మాంక్స్‌ స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కోకొండా జయచందర్‌ రెడ్డి, సంజయ్‌ రెడ్డి, అనిల్‌ పల్లాల నిర్మాతలు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ప్రవీణ్‌ కె బంగారి, సంగీతం: చరణ్‌ అర్జున్‌.

Social Share Spread Message

Latest News