Namaste NRI

లాంఛనంగా ప్రారంభమైన ధర్మచక్రం

సంకేత్‌ తిరుమనీడి, మోనిక చౌహాన్‌ నాయికానాయకులుగా పద్మ నారాయణ ప్రొడక్షన్‌ బ్యానర్‌లో తెరకెక్కుతున్న చిత్ర ధర్మ చక్రం. పూజా కార్యక్రమాలతో చిత్రం ప్రారంభమైంది. మొదటి సన్నివేశానికి వరుణ్‌ క్లాప్‌ కొట్టగా, రాజశేఖర్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు నాగ్‌ ముంత మాట్లాడుతూ ఆడవాళ్లపై అఘాయిత్యాలు జరుగుతున్న సంఘటనలు రోజూ చూస్తున్నాం. వీటిని అరికట్టేలా, అమ్మాయిలకు స్వీయ రక్షణ నేర్పించేలా ఈ చిత్రం ఉంటుంది. ఇందులో కథనాయిక ద్విపాత్రాభినయం చేస్తోందన్నారు. నిర్మాత జీపీ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో ఆడపిల్లలపై జరుగుతున్న అన్యాయాలే ఇందులో కథాంశం అన్నారు. ఈ చిత్రానికి నాగ్‌ ముంత దర్శకుడు. ఎ.శ్రీధర్‌ గౌరవ దర్శకత్వం వహించారు. సంగీతం: ప్రణయ్‌ రాజుపుటి, ఛాయాగ్రాహకుడు: ఎం. ఆనంద్‌. సెప్టెంబర్‌లో విడుదల చేయటానికి మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నాం అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events