ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి రచించిన పొన్నియిన్ సెల్వన్ నవల ఆధారంగా మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో కీలక పాత్రధారులు లుక్స్‌ని రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే విక్రమ్, ఐశ్యర్యారాయ్ తదితరుల లుక్స్ విడుదలయ్యాయి. తాజాగా త్రిష లుక్‌ని రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో రాణి కుందవై పాత్ర చేస్తున్నారు త్రిష. ఆమె లుక్‌ని రిలీజ్ చేసి, పురుషుల ప్రపంచంలో దైర్యం ఉన్న స్త్రీ రాణి కుందవై అని చిత్ర బృందం పేర్కొంది. ఈ పోస్టర్‌లో త్రిష ఒంటినిండా నగలతో అత్యంత సౌందర్యంతో రవివర్మ గీసిన పేయింటింగ్‌లా మెరిసిసోతుంది. ఈ పోస్టర్ త్రిష అభిమానులను ఫిదా చేస్తుంది. చియాన్ విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష, బాబీ సింహా వంటి స్టార్లు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్ జులై 7న తంజావూరులోని బృహదేశ్వరా టెంపుల్‌లో విడుదల చేయనున్నారని కోలీవడ్ వర్గాల సమాచారం. తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో తొలి భాగాన్ని సెప్టెంబర్ 30న విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్.














