Namaste NRI

ధనుష్‌ హాలీవుడ్‌ చిత్రం ది గ్రే మ్యాన్‌  సందడి

అగ్ర హీరో ధనుష్‌ కీలక పాత్రలో నటించిన హాలీవుడ్‌ చిత్రం ది గ్రేన్‌ మ్యాన్‌. ప్రముఖ దర్శకులు రూసో బ్రదర్స్‌ ఆంటోనీ, జో  ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ర్యాన్‌ గోస్లింగ్‌ కథానాయకుడు. క్రిస్‌ ఇవాన్స్‌, అనా డి.ఆర్మాన్‌ కీలక పాత్రలు పోషించారు. నెట్‌ఫ్లిక్స్‌ కోసం రూపొందించిన ఈ సినిమా ఈ నెల 22 నుంచి ప్రదర్శనకి అందుబాటులో ఉంటుంది. ముంబయిలో ప్రత్యేక ప్రదర్శనని ఏర్పాటు చేశారు. ఇందులో పాల్గొనేందుకు భారత్‌ వస్తున్నట్లు తెలిపారు రూసో బ్రదర్స్‌. ఈ సందర్భంగా ధనుష్‌ మాట్లాడుతూ ఈ సినిమా ప్రయాణం ఓ రోలర్‌కోస్టర్‌ రైడ్‌లా జరిగింది. యాక్షన్‌తో పాటు చక్కటి డ్రాబా, భారీ పోరాట ఘట్టాలు ఉంటాయి. మార్క్‌ గ్రీన్‌ రాసిన ది గ్రే మ్యాన్‌ పుస్తకం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం యాక్షన్‌ డ్రామాగా రూపొందింది. ఆంగ్ల, హిందీ, తెలుగు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో కూడా విడుదల చేయబోతున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events