Namaste NRI

డొనాల్డ్‌ ట్రంప్‌ ఇక తప్పుకుంటే మంచిది

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ క్రియాశీల రాజకీయాలకు స్వస్తి పలికి శేష జీవితాన్ని హాయిగా గడపాలని టెస్లా సీఈఓ ఎలాన్‌ మాస్క్‌ అన్నారు.  అధ్యక్షుడు బైడెన్‌ పదవీకాలం ముగిసేనాటికి ట్రంప్‌ వయస్సు 82 ఏళ్లవుతుందని అన్నారు. అమెరికా సహా దేనికైనా సీఈవోగా వ్యవహరించడానికి ఆ వయసు చాలా ఎక్కువని వ్యాఖ్యానించారు. ట్రంప్‌పై తనకు ఎలాంటి ద్వేషం లేదన్నారు. డెమోక్రటిక్‌ పార్టీ వారు సైతం ట్రంప్‌పై విమర్శలు చేయడం మానుకోవాలన్నారు. అధ్యక్ష పదవిని చేపట్టడం తప్ప ట్రంప్‌ మరో మార్గం లేదన్న భావన ఆయనలో కలిగించొద్దన్నారు.  ట్రంప్‌ అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకోవాలని మస్క్‌ బహిరంగంగా సూచించడం ఇదే తొలిసారి. ఆలస్కాలో జరిగిన ఓ కార్యక్రమంలో మస్క్‌పై ట్రంప్‌ పలు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే మాస్క్‌ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events