Namaste NRI

మహావీరుడు టైటిల్‌ను లాంచ్‌ చేసిన మహేష్‌ బాబు

శివకార్తికేయన్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం మహావీరుడు. మడోన్‌ అశ్విన్‌ దర్శకత్వంలో శాంతి టాకీస్‌ పతాకంపై అరుణ్‌ విశ్వా నిర్మిస్తున్నారు.  సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ఈ సినిమా టైటిల్‌ను ఆవిష్కరించారు. తెలుగులో ఈ చిత్రానికి మహావీరుడు అనే టైటిల్‌ను ఖరారు చేయగా, తమిళ్‌ వర్షన్‌కు మావీరన్‌ అనే టైటిల్‌ను పెట్టారు. శివకార్తికేయన్‌ మహావీరుడు టైటిల్‌ను ఆవిష్కరించడం ఆనందంగా ఉంది. టీమ్‌ అందరికి మహేశ్‌ బాబు శుభాకాంక్షలు తెలిపారు.  ఈ సందర్భంగా వీడియో మైండ్‌ బ్లోయింగ్‌గా వుంది. శివకార్తికేయన్‌ను తాళ్లతో కట్టగా.. ఆయన అలా తాళ్లతోనే విలన్స్‌ని స్ఠయిలిస్‌గా కొట్టడం చాలా డిఫరెంట్‌గా వుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: విధు అయ్యన్న,  సంగీతం: భరత్‌ శంకర్‌, నిర్మాణ సంస్థ: శాంతి టాకీస్‌, రచన `దర్శకత్వం` మడోన్‌ అశ్విన్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events