Namaste NRI

శ్రీశ్రీ రవిశంకర్‌కు అరుదైన సత్కారం

ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ సంస్థ వ్యవస్థాపకులు శ్రీశ్రీ గురుదేవ్‌ రవిశంకర్‌కు అరుదైన గౌరవం దక్కింది. దక్షిణ అమెరికా తీరప్రాంత దేశమైన సురినామ్‌ తమ దేశ అత్యున్నత పౌర అవార్డు ఆనరరీ ఆర్డర్‌ ఆఫ్‌ ది ఎల్లో స్టార్‌ అవార్డుతో రవిశంకర్‌ను సత్కరించింది. సురినామ్‌ అధ్యక్షుడు చంద్రికా ప్రసాద్‌ సంతోఖి ఈ అవార్డును ఆయనకు అందజేశారు. ఇప్పటి వరకూ దేశాధిపతులకు మాత్రమే ఇచ్చిన ఈ అవార్డు మొట్టమొదటిసారి ఓ ఆధ్యాత్మికవేత్త, ఆసియావాసి అందుకొన్నారు. ఈ అవార్డును అందుకున్న మొదటి ఆసియావాసి గురుదేవ్‌ రవిశంకర్‌ కావడం మరో విశేషం.  ఇప్పటి వరకూ దేశాధిపతులకు మాత్రమే ఇచ్చిన ఈ అవార్డు మొట్టమొదటిసారిగా ఒక ఆధ్యాత్మిక గురువుకు బహుకరించారు. సురినాయ్‌ అధ్యక్ష భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో అక్కడి భారత రాయబారి డాక్టర్‌ శంకర్‌ బాలచంద్రన్‌ పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events