అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య ఇవానా ట్రంప్ మృతి చెందిన విషయం తెలిసిందే. న్యూయార్క్ సిటీలోని తన ఇంట్లో ఆమె ప్రాణాలు విడిచారు. అయితే మెట్ల మీద నుంచి కింద పడడం వల్ల మరణించినట్లు అనుమానాలు ఉన్నాయి. న్యూయార్క్ సిటీ మెడికల్ ఆఫీసర్ ఇవానా మృతిపై రిపోర్ట్ ఇచ్చారు. మొండెం భాగానికి బలమైన గాయాలు కావడం వల్లే ఇవానా ప్రాణాలు విడిచినట్లు మెడికల్ ఆఫీసర్ తన రిపోర్ట్‌లో తెలిపారు. మెట్ల మీద నుంచి కిందపడినట్లు వస్తున్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే ఎప్పుడు ఈ ఘటన జరిగిందో మెడికల్ ఆఫీసర్ తన రిపోర్ట్‌లో చెప్పలేదు. కానీ ఇవానా ట్రంప్ మరణం ప్రమాదమే అని తేల్చారు.














