Namaste NRI

రిషి సునాక్‌ వైపే బ్రిటన్‌

 బ్రిటన్‌లో కన్జర్వేటివ్‌ పార్టీ తదుపరి నేతగా, ప్రధానమంత్రి పదవికి బోరిస్‌ జాన్సన్‌ వారసుడిగా మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్‌ వైపే దాదాపు సగం మంది ఓటర్లు మొగ్గు చూపుతున్నారు.  రిషి మంచి ప్రధాని కాగలరని కన్జర్వేటివ్‌ పార్టీ ఓటర్లలో 48 శాతం అభిప్రాయపడుతున్నట్లు జేఎల్‌ పార్టనర్స్‌ సంస్థ సర్వేలో తేలింది. రిషి అత్యధికుల్ని ఆకర్షిస్తున్నారని జేఎల్‌ పార్టనర్స్‌ సహ వ్యవస్థాపకుడు జేమ్స జాన్సన్‌ తెలిపారు. 39 శాతం మంది విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రస్‌కు మద్దతిచ్చారు. రిషికి గట్టి పోటీగా భావిస్తున్న వాణిజ్య మంత్రి పెన్నీ మోర్డంట్‌ 33 శాతంతో మూడో స్థానంలో ఉండటం విశేషం. ఈ ముగ్గురి నడుమ పోటీ తీవ్రంగా ఉంది.  మోర్డాంట్‌ గురించి ఎక్కువ మంది అభిప్రాయం తటస్థంగా ఉన్నట్లు తెలుస్తోంది. గత వారం నిర్వహించిన ఈ సర్వేలో ప్రతిపక్ష లేబర్‌ పార్టీకి 42 పాయింట్లు దక్కగా, పాలక కన్జర్వేటివ్‌ పక్షానికి 31 పాయిట్లు రావడం గమనార్హం.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events