రావణ్ నిట్టూరు, శ్రీ నికిత జంటగా నటిస్తున్న చిత్రం అలిపిరికి అల్లంత దూరంలో. ఈ చిత్రాన్ని కాస్కేడ్ పిక్చర్స్ పతాకంపై రమేష్ డబ్బుగొట్టు, రెడ్డి రాజేంద్ర పి నిర్మిస్తున్నారు. ఆనంద్ జే దర్శకుడు. రాబరీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా తిరుపతిలో షూటింగ్ జరుపుకుంటున్నది. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను దర్శకురాలు నందినీ రెడ్డి విడుదల చేశారు. ఫస్ట్ లుక్ బాగుందన్న ఆమె చిత్ర బృందానికి విషెస్ తెలిపారు. షూటింగ్ మొత్తం తిరుపతిలోనే జరుగుతుంది అని చిత్ర యూనిట్ పేర్కొంది. శ్రీ నిఖిత, అలంకృత షా, బొమ్మకంటి రవీందర్, అమృత వర్షిణి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటర్ : సత్య గిడుతూరి, సంగీతం: ఫణి కల్యాణ్.














