Skip to main content

Namaste NRI

 బ్రిటన్ ప్రధాని రేసులో దూసుకెళ్తోన్న లిజ్‌ ట్రుస్‌

బ్రిటన్‌ తదుపరి ప్రధానమంత్రిగా విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రుస్‌ కన్జర్వేటివ్‌ పార్టీ అధ్యక్షురాలిగా ప్రధాన మంత్రిగా అయ్యే అవకాశాలు 90 శాతం మేరకు ఉన్నాయని బెట్టింగ్‌ సంస్థ స్మార్కెట్స్‌ అధ్యయనంతో తెలింది. భారత సంతతికి చెందిన రిషి సునక్‌కు చాలా తక్కువగానే ఉన్నాయి. పార్టీ కార్యకర్తల మద్దతు కోసం 6 వారాలుగా రిషి సునక్‌, లిజ్‌ ట్రుస్‌లు యూకే వ్యాప్తంగా పర్యటిస్తున్న విషయం తెలిసిందే. రిషి ప్రధాని అయ్యే చాన్స్‌ 10 శాతానికి పడిపోయిందని స్మార్కెట్‌ తెలిపింది. తొలుత రిషికే ఎక్కువ అవకాశం ఉండగా, చివరి పోటీలో ఆయన  వెనుకంజలో ఉన్నారు.

Social Share Spread Message

Latest News