Skip to main content

Namaste NRI

కళాపురం ఫస్ట్‌ లుక్‌ విడుదల

రా మూవీగా పలాస 1978ను రూపొందించి ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు కరుణకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కళాపురం. ఇక్కడ అందరూ కళాకారులే అనేది ఉపశీర్షిక. జీ స్టూడియోస్‌ సమర్పణలో ఆర్‌4  ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రజనీ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సత్య రాజేష్‌, చిత్రం శ్రీను, రక్షిత్‌ అట్లూరి కీలక పాత్రలు పోషించారు. కామెడీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాని ఆగస్ట్‌ 26న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు నిర్మాత తెలిపారు. చిత్ర బృందం ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసింది. సిట్యూవేషనల్‌ కామెడీతో ప్రేక్షకులను అలరించటానికి దర్శకుడు రెడీ అవుతున్నారు. సందర్భోచిత హాస్యంతో రూపొందిన చిత్రమిది. అన్ని పాత్రలూ ఆసక్తికరంగా ఉంటాయని సినీ వర్గాలు తెలిపారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Social Share Spread Message

Latest News