కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. మునుగోడు ప్రజలకు మేలు జరుగుతుందనే రాజీనామా చేస్తున్నానని తెలిపారు. ఉప ఎన్నిక జరిగితేనే నియోజకవర్గానికి ప్రభుత్వం నిధులు వస్తాయనే ప్రచారం జరుగుతోందన్నారు. ఏ పార్టీలో చేరేది త్వరలోనే ప్రకటిస్తానని తెలిపారు. అయితే అరాచకపాలన పోవాలంటే బీజేపీ వల్లే సాధ్యమన్నారు. బాధతోనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానని తెలిపారు. స్పీకర్ సమయం తీసుకుని రాజీనామా లేఖ ను అందజేస్తానని వెల్లడిరచారు. గెలుపోటముల్ని ప్రజలే నిర్ణయిస్తారని తెలిపారు.














