Skip to main content

Namaste NRI

కాంగ్రెస్‌ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి… కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా

కాంగ్రెస్‌ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి రాజీనామా చేశారు. మునుగోడు ప్రజలకు మేలు జరుగుతుందనే రాజీనామా చేస్తున్నానని తెలిపారు. ఉప ఎన్నిక జరిగితేనే నియోజకవర్గానికి ప్రభుత్వం నిధులు వస్తాయనే ప్రచారం జరుగుతోందన్నారు. ఏ పార్టీలో చేరేది త్వరలోనే ప్రకటిస్తానని తెలిపారు. అయితే అరాచకపాలన పోవాలంటే బీజేపీ వల్లే సాధ్యమన్నారు. బాధతోనే కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నానని తెలిపారు. స్పీకర్‌ సమయం తీసుకుని రాజీనామా లేఖ ను అందజేస్తానని వెల్లడిరచారు. గెలుపోటముల్ని ప్రజలే నిర్ణయిస్తారని తెలిపారు.

Social Share Spread Message

Latest News