తాను రాజకీయ పార్టీ ప్రారంభించబోతున్నట్లు వచ్చిన వార్తలను సూపర్ స్టార్ రజినీ కాంత్ తోసిపుచ్చారు. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవితో భేటీ కావడంతో రజినీ కాంత్ రాజకీయాల్లోకి వస్తున్నారన్న వార్తలు హల్‌చల్ చేశాయి. ఈ అంశంపై రజినీకాంత్ మీడియాతో మాట్లాడారు. ఏ సమయంలోనూ రాజకీయాల్లోకి తిరిగి రావాలని ప్రణాళికలు రూపొందించుకోలేదని తేల్చి చెప్పారు.. మీరు రాజకీయాల్లోకి తిరిగి వస్తారా.. ఆ ప్రణాళికలు ఉన్నాయా? అని ప్రశ్నించినప్పుడు రజినీకాంత్ `నో` అని చెప్పారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పాల్గొనడం గానీ, రాజకీయాల్లోకి రావడం గానీ లేదని తేల్చేశారు. తాను ఆధ్యాత్మికతను ప్రేమిస్తానని పేర్కొన్నారు.














