Skip to main content

Namaste NRI

రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై త‌లైవా ఏమ‌న్నారంటే?

తాను రాజ‌కీయ పార్టీ ప్రారంభించ‌బోతున్న‌ట్లు వ‌చ్చిన వార్త‌ల‌ను సూప‌ర్ స్టార్ ర‌జినీ కాంత్ తోసిపుచ్చారు. త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ ఆర్ఎన్ ర‌వితో భేటీ కావ‌డంతో ర‌జినీ కాంత్ రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నార‌న్న వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేశాయి. ఈ అంశంపై ర‌జినీకాంత్ మీడియాతో మాట్లాడారు.  ఏ స‌మ‌యంలోనూ రాజ‌కీయాల్లోకి తిరిగి రావాల‌ని ప్ర‌ణాళిక‌లు రూపొందించుకోలేద‌ని తేల్చి చెప్పారు.. మీరు రాజ‌కీయాల్లోకి తిరిగి వ‌స్తారా.. ఆ ప్ర‌ణాళిక‌లు ఉన్నాయా? అని ప్ర‌శ్నించిన‌ప్పుడు రజినీకాంత్ `నో` అని చెప్పారు. వ‌చ్చే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో పాల్గొన‌డం గానీ, రాజ‌కీయాల్లోకి రావ‌డం గానీ లేద‌ని తేల్చేశారు. తాను ఆధ్యాత్మిక‌త‌ను ప్రేమిస్తాన‌ని పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News