Skip to main content

Namaste NRI

అత్యంత ప్రతిష్టాత్మకమైన బిల్లుపై ..జో బైడెన్‌ సంతకం

అమెరికా చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన బిల్లుగా  పేర్కొంటున్న ఇన్‌ ప్లేషన్‌ రిడక్షన్‌ యాక్ట్‌ 2022 పై అధ్యక్షుడు జో బైడెన్‌ సంతకం చేశారు. ఈ బిల్లును అమెరికాలోని ఉభయ సభలు ఆమోదించాయి. పర్యావరణం పరిరక్షణ, ప్రజారోగ్య సంరక్షణ కోసం 740  బిలియన్‌ డాలర్లను అమెరికా వ్యయం చేయనుంది.

                కాలుష్యం వల్ల భూతాపం పెరిగిపోయి వాతావరణంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. దీన్ని తగ్గించేందుకు 375 బిలియన్‌ డాలర్లను అమెరికా ఖర్చు చేయనుంది. దేశ ప్రజల ఆరోగ్య బీమా కోసం ఒక్కొక్కరు ఏడాదికి వారి జేబు నుంచి 2,000 డాలర్లకు మించి ఖర్చు చేసే అవసరం లేకుండా చూడడం మరొకటి. ఇందుకు కావాల్సిన నిధుల కోసం పెద్ద కంపెనీలు, సంపన్నులపై అదనపు పన్ను వేయనున్నారు. వైద్యులు సూచించే మందుల ధరలు తగ్గించనున్నారు. వైద్య ప్రయోజనాలను బీమా కింద పెంచనున్నారు. పునరుత్పాదక ఇంధనాలకు ప్రాధాన్యం పెంచనున్నారు.

Social Share Spread Message

Latest News