Namaste NRI

డొనాల్డ్‌ ట్రంప్‌ ఇంట్లో రహస్య పత్రాలు

ఫ్లోరిడాలో  అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మార్‌ ఎ లాగో ఎస్టేట్‌ లో ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (ఎఫ్‌బీఐ) చేపట్టిన తనిఖీలకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశానికి చెందిన అత్యంత రహస్య పత్రాలను ట్రంప్‌ తన ఇంట్లో ఇతర మ్యాగజైన్లు, వార్త పత్రికలు, కాగితాల మధ్య కలిపేశారని తెలిపింది. ఎఫ్‌బీఐ అఫిడవిట్‌లో ఈ విషయం వెల్లడైంది. అయితే ట్రంప్‌ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో  దేశానికి చెందిన కొన్ని రహస్య ప్రతాలను ఇక్కడకు తరలించారని ఫెడరల్‌ బ్యూరోకు విశ్వసనీయ సమాచారం వచ్చింది. దీంతోఈ ఎఫ్‌బీఐ అధికారులు ఈ ఎస్టేట్‌లో సోదాలు చేపట్టగా 15 బాక్సుల్లో పత్రాలు లభించాయి. ఈ సోదాలకు సంబధించిన ఆఫిడవిట్‌ను ఎఫ్‌బీఐ తాజాగా బయటపెట్టింది.

                ఈ బాక్సుల్లో 67 విశ్వసనీయ, 92 రహస్య, 25 అత్యంత రహస్య పత్రాలు లభించినట్లు తెలుస్తోంది. ఈ పత్రాలను ట్రంప్‌ తన ఇంట్లో ఇతర కాగితాలతో కలిపి ఉంచినట్లు తెలిసింది. ఒక్కో బాక్సుల్లో   రహస్య పత్రాలతో పాటు వార్త పత్రికలు, మ్యాగజైన్లు, ఫోటోలు, వివిధ రకాల ప్రింట్‌ అవుట్‌లు, వ్యక్తిగత పత్రాలు కలిపి ఉన్నట్లు తేలింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events