Skip to main content

Namaste NRI

ఇస్తాంబుల్‌ లో ఎన్‌బీకే కీలక షెడ్యూల్‌

టాలీవుడ్‌ హీరో బాలకృష్ణ నటిస్తోన్న మోస్ట్‌ క్రేజీ ప్రాజెక్టు ఎన్‌బీకే 107. స్టార్‌ డైరెక్టర్‌ గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శృతిహాసన్‌ ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌ చేస్తోంది. ఎస్‌ థమన్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌. నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ నిర్మాతలు. ప్రస్తుతం ఇస్తాంబుల్‌లో కీలక సన్నివేశాల చిత్రీకరణలో బిజీ బిజీగా గడుపుతోంది. ఇటీవల మొదలైన కొత్త షెడ్యూల్‌లో నాయకానాయికలతో పాటు, ఇతర తారాగణంపై టాకీ, యాక్షన్‌ సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నట్లు చిత్ర వర్గాలు తెలిపారు. ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం. ఛాయాగ్రహణం: రిషిపంజాబీ, కూర్పు: నవీన్‌ నూలి, సంగీతం: తమన్‌, మాటలు: సాయిమాధవ్‌ బుర్రా, పోరాటాలు: రామ్‌`లక్ష్మణ్‌.

Social Share Spread Message

Latest News