Skip to main content

Namaste NRI

 ఘనంగా ప్రారంభమైన క్రైమ్‌ & లవ్‌ సోర్టీ.. నీకై నేను

శ్రీజిత్‌ వడ్డి, క్రిష కురుప్‌ జంటగా నటిస్తున్న చిత్రం నీకై నేను.  అజయ్‌ రాజీవ్‌ కనకాల తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎన్‌జీఎస్పీ క్రియేషన్స్‌ పతాకంపై నాగిరెడ్డి తారక ప్రభు, ఏ హనీఫ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కృష్ణకుమార్‌ అసూరి దర్శకుడు. భాస్కర్‌రాజ ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత. ఈ చిత్ర షూటింగ్‌ ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి సి. కల్యాణ్‌ క్లాప్‌ కొట్టగా యస్‌. గోపాల్‌ రెడ్డి కెమెరా స్విచ్చాన్‌ చేశారు. ఘాట్‌ రోడ్‌ నేపథ్యంలో సాగే క్రైమ్‌, లవ్‌ చిత్రమిదని, అందరికీ నచ్చేలా రూపొందిస్తామని అన్నారు దర్శకుడు. నిర్మాత నాగిరెడ్డి తారకప్రభు మాట్లాడుతూ  మున్నార్‌లో ఈ నెల 15 తేదీ నుంచి మునార్‌లో రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభిస్తాం. సింగిల్‌ షెడ్యూల్‌లో  సినిమాను పూర్తి చేసి డిసెంబర్‌లో విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నాం అన్నారు.  ఈ చిత్రానికి సంగీతం: మెగా కోటి, ఛాయాగ్రహణం: వాసు.పి.

Social Share Spread Message

Latest News