Skip to main content

Namaste NRI

ఆ  కోరిక ఈ సినిమాతో నెరవేరింది  : రెజీనా

రెజీనా కాసాండ్ర, నివేదా థామస్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా శాకిని డాకిని. కొరియన్‌ ఫిల్మ్‌ మిడ్‌నైట్‌ రన్నర్స్‌ కు తెలుగు రీమేక్‌గా దర్శకుడు సుధీర్‌ వర్మ తెరకెక్కిస్తున్నారు. సురేష్‌ బాబు, సునీత తాటి, హ్యూన్యూ యథామస్‌ కిమ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ నెల 16న సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో  మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయిక రెజీనా మాట్లాడుతూ నా తొలి చిత్రం నుంచీ నాకు యాక్షన్‌ చేయడమంటే చాలా ఇష్టం. మొత్తానికి ఆ కోరిక ఈ సినిమాతోనే నెరవేరింది అంది. నివేదా థామస్‌ మాట్లాడుతూ మా ఇద్దర మధ్య చిరాకుతో కూడిన ఫన్‌ రిలేషన్‌ ఉంటుంది. ఈ చిత్ర యాక్షన్‌ ఎపిసోడ్స్‌ కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నాం అని తెలిపింది. నిర్మాత సునీత తాటి మాట్లాడుతూ ఇద్దరు మహిళా ట్రైనీ పోలీసులు ఒక క్రైమ్‌ని ఎంతో సాహసంతో చాకచక్యంగా ఎలా డీల్‌ చేశారన్నదే ఈ చిత్ర కథ. ఎగ్‌ హార్వెస్టింగ్‌ అనే వినూత్నమైన పాయింట్‌ ఈ కథలో ఉంది అన్నారు.

Social Share Spread Message

Latest News