Skip to main content

Namaste NRI

బనారస్ నుండి ట్రోల్ సాంగ్ విడుదల

కర్ణాటక సీనియర్‌ రాజకీయ నేత జమీర్‌ అహ్మద్‌ కుమారుడు జైద్‌ ఖాన్‌, బెల్‌ బాటమ్‌ ఫేమ్‌ జయతీర్థ దర్శకత్వం వహించిన పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ బనారస్‌ తో సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. బనారస్‌ సిటీ (వారణాసి) నేపథ్యంలో సాగే ఆహ్లాదకరమైన ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రంలో సోనాల్‌ మోంటెరో కథానాయికగా నటిస్తోంది. ఎన్‌కె ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై తిలకరాజ్‌ బల్లాల్‌ ఈ చిత్రాన్ని  నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌ సింగిల్‌ ట్రోలో సాంగ్‌ విడుదలైంది. పాటా చాలా హుషారుగా ఉంది. జైద్‌ఖాన్‌ వండర్‌ఫుల్‌ డ్యాన్స్‌ మూమెంట్స్‌తో ఆకట్టుకున్నారు.  బి. అజనీష్‌ లోక్నాథ్‌ కంపోజ్‌ చేసిన ఎనర్జిటిక్‌ బీట్లతో కూడిన పార్టీ సాంగ్‌ ఇది. పాట చాలా హుషారుగా వుంది. జాన్సీ గిఫ్ట్‌ వాయిస్‌ మరింత ఉత్సాహాన్ని తెచ్చింది. ఈ  ఏడాది నవంబర్‌ 4న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా పాన్‌ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News