సంజయ్ రావు హీరోగా ప్రణవి మానుకొండ జంటగా నటిస్తున్న చిత్రం స్లమ్ డాగ్ హజ్బెండ్. ఏఆర్ శ్రీధర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బ్రహ్మాజీ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలోని లచ్చి గాని పెళ్లి ఇగ పార్శి గుట్లల లొల్లి గీతాన్ని హీరో రవితేజ తాజాగా విడుదల చేశారు. పాటలో చాలా జోష్ ఉందని, పాటతో పాటు సినిమా కూడా హిట్ అవ్వాలని మూవీ టీమ్ కు విశెస్ తెలిపారు. ఈ పాటకు భీమ్స్ సిసిరోలియా స్వరాలందించడమే కాక స్వయంగా ఆలపించారు. కాసర్త శ్యామ్ సాహిత్యమందించారు. మంచి వినోదాత్మక కథతో సాగే ఎంటర్టైనర్ ఇది. ఈ సినిమా ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలో ఉంది. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం అని చిత్ర వర్గాలు తెలిపాయి.