Skip to main content

Namaste NRI

సౌదీ శుభవార్త… విదేశీ విద్యార్థులకు

సౌదీ అరేబియా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విదేశీ విద్యార్థులకు స్పాన్సర్స్‌ అవసరం లేకుండానే ఎడ్యుకేషనల్‌ వీసాలు ఇస్తామని ప్రకటించింది. దీనికోసం తాజాగా ఆ దేశ కేబినెట్‌ కొత్త విద్యా వీసాలను ప్రవేశపెట్టింది. వీటిలో దీర్ఘకాలిక వీసాలను విద్యార్థులు, పరిశోధకులు, నిపుణులకు ఇవ్వనున్నారు. విద్యా ప్రయోజనాల కోసం కొత్త వీసాల జారీలో ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఈ సందర్భంగా మంత్రిమండలి వెల్లడిరచింది. కింగ్‌ సల్మాన్‌ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.  ఇక స్వల్పకాలిక వీసాలను విద్యార్థులు, పరిశోధకులు, విజిటింగ్‌ ట్రైనీలకు భాషా అధ్యయనం, శిక్షణ, షార్ట్‌ ప్రోగ్రామ్‌లలో పాల్గొనడంతో పాటు విద్యార్థి మార్పిడి కార్యక్రమాల ప్రయోజనాల కోసం మంజూరు చేయడం జరుగుతుందని మంత్రిమండలి ప్రకటించింది.

 

Social Share Spread Message

Latest News