Skip to main content

Namaste NRI

రొమాంటిక్ గా అల్లు శిరీష్ ఊర్వశివో రాక్షసివో టీజర్

అల్లు శిరీష్‌, అను ఇమ్మాన్యుయేల్‌ జంటగా నటిస్తున్న చిత్రం ఊర్వశివో రాక్షసివో. రాకేష్‌ శశి దర్శకుడు. జీఏటూ పిక్చర్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ సమర్పణలో ధీరజ్‌ మొగిలినేని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. దర్శకుడు మాట్లాడుతూ యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న చిత్రమిది. యూత్‌తో పాటు అన్ని వర్గాలకు ఆకట్టుకునే విధంగా ఉంటుంది. అల్లు శిరీష్‌ పాత్ర సరికొత్తగా వుంటుంది. ఈ చిత్రంలోని సన్నివేశాలు, సంభాషణలు నేటి యువతరానికి కనెక్ట్‌ అయ్యే విధంగా ఉంటాయి అన్నారు. ఈ సినిమా నవంబరు 4న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: అచ్చు రాజమణి, సహ నిర్మాత : విజయ్‌ ఎం. ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: బాబు, కెమెరా: తన్వీర్‌.

Social Share Spread Message

Latest News